లీకైన ‘మణికర్ణిక’ లుక్‌..!

191
Kangana Ranaut looks regal in photos from Manikarnika sets in Jaipur
- Advertisement -

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌కి ఓ చారిత్రాత్మక చిత్రాన్ని అందించిన డైరెక్టర్ క్రిష్. “గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు క్రిష్‌. ప్రస్తుతం మరోసారి మరో చారిత్రాత్మక చిత్రంతో బాలీవుడ్ ఆడియెన్స్‌ని కూడా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. క్వీన్ ఆఫ్ బాలీవుడ్‌గా పేరున్న కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి రియల్ స్టోరీతో ‘మణికర్ణిక’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు క్రిష్.

Untitled-2 copy

‘మణికర్ణిక’ మూవీ ప్రస్తుతం జైపూర్‌లో షూటింగ్‌ జరుకుంటుంది. ఇంకా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. దీంతో చిత్రంలో కంగన ఎలా కనిపించబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే సినిమా సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోల్లో లక్ష్మీభాయ్‌గా కంగన చక్కగా కనిపించారు. ఒక ఫొటోలో ఆమె తన పాత్ర స్క్రిప్టు చదువుకుంటూ కనిపించారు. మరోదానిలో దర్శకుడు క్రిష్‌ ఏదో సన్నివేశాన్ని ఆమె వివరిస్తున్నారు. లక్ష్మీభాయ్‌ తన పుత్రుడ్ని ఎత్తుకుని యుద్ధ మైదానానికి వెళ్తారు. ఈ సన్నివేశాన్ని జైపూర్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం.

సోనూసూద్‌, సురేశ్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి, వైభవ్‌ తదితరులు ‘మణికర్ణిక’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను అందించారు. ప్రసూన్‌ జోషి గేయ రచయిత. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

- Advertisement -