చాలాకాలం గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు తేజ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా హిట్ తర్వాత బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్,విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. వెంకీ హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి సురేశ్ ప్రొడక్షన్స్ ,ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతగా వ్యవహరించనున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ‘ ఈ నగరానికి ఏమైంది’? అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. వచ్చె నెల ఈ సినిమా లాంచ్ కానుండగా వెంకీ సరసన అనుష్క హీరోయిన్గా నటించే అవకాశం ఉంది.
వెంకీకి విలన్‌గా మరో హీరోను రంగంలోకి దించేందుకు తేజ కసరత్తు చేస్తున్నారు. ‘జయం’ సినిమాలో గోపీచంద్ విలన్‌గా ఆకట్టుకోగా తాజాగా నారా రోహిత్‌ని ప్రతినాయకుడిగా దించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల కాస్త బరువు తగ్గిన రోహిత్, సిక్స్ ప్యాక్ కూడా తెచ్చుకొన్నాడు. రోహిత్ ఆహార్యం, డైలాగులు పలికే పద్దతి ప్రతినాయక పాత్రకి బాగా పనికొస్తాయని తేజ భావించారట. అందుకే నారా రోహిత్‌కి స్థానం కల్పించారని సమాచారం. మొత్తంగా వెంకీ సినిమా కోసం తేజ చేస్తున్న కసరత్తులు అంచనాలను పెంచేస్తున్నాయి.