సార్క్‌ సదస్సుకు కేజ్రీ..!

262
- Advertisement -

సోషల్ మీడియా వేదికగా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల దాడి చేయ‌డంలో ముందుండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు నెటిజన్లు ఉహించని షాకిచ్చారు. యూరీ ఉగ్రదాడిపై కేజ్రీ తాజాగా చేసిన ట్వీట్‌పై ఆయన ఫాలోవ‌ర్లు తీవ్రంగా మండిప‌డ్డారు. ఇటీవలి యూరీ దాడిపై ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఓ పత్రికలో వచ్చిన ఆర్టిక‌ల్‌ని ఉటంకిస్తూ ఆ మీడియా అద్భుతమైన కథనాన్ని ప్ర‌చురించింద‌ని పేర్కొన్నారు. యూరీ దాడి విషయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కాదు, భారతదేశమే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోంది” అని ఆయన ట్వీట్ చేశారు.

kejriwal

ఇప్పుడిదే ఆయనకు నెటిజన్ల నుంచి తలనొప్పిని తీసుకొచ్చింది. యూరి ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టిలో పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటి ఫలిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో నవంబర్ నెలలో నిర్వహించే సార్క్ సదస్సుకు హాజరు కాకూడదని భారతదేశం నిర్ణయించుకున్న తర్వాత.. అదే బాటలో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా సదస్సును బహిష్కరించాయి.మరోవైపు అమెరికా వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక సైతం పాక్‌ దుశ్చర్యను కడిగిపారేసింది. భారత్ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని….దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది.

delhi

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాత్రం ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో భారతీయులతో పాటు ఇతర దేశాలలో వాళ్లు కూడా ఆయనను తీవ్రంగా విమర్శించారు. సార్క్ సదస్సుకు మోడీ రాకపోతే.. ఆయన బదులు కేజ్రీవాల్ రావచ్చుగా అంటూ నెటిజన్లు తమదైన శైలీలో సెటైర్లు విసురుతున్నారు. అసలు కేజ్రీవాల్‌కు బుర్ర ఉందా.. ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరు అంటూ రకరకాలుగా మండిపడ్డారు. మరికొందరు తీవ్ర అసభ్య పదజాలంతో కూడా కేజ్రీవాల్‌ను దూషించారు.

kej

- Advertisement -