సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కిన ధోని బయోపిక్ ‘ధోని:ది అన్‌టైటిల్డ్ స్టోరీ’ విడుదలపై పాక్ ప్రభుత్వం నిషేదం విధించింది. యూరీ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతదేశంలో ఉన్న పాక్ నటులు వెంటనే అక్కడకు వెళ్లిపోవాలని ఎమ్‌ఎన్ఎస్ ప్రకటించిన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇకపై భారతదేశానికి చెందిన సినిమా కూడా పాకిస్థాన్ థియేటర్లలో ప్రదర్శించకూడదని ఆదేశాలు కూడా జారీ చేసిందట.
తెలుగు, తమిళం, హిందీల్లో భారీగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత్ విడుదలవుతున్న ఈ సినిమా పాక్ లో విడుదల చేయడం లేదని, ఉరి ఘటన తర్వాత భారత్, పాక్ లో నెలకొన్న పరిస్థితులు కారణంగానే ధోని చిత్రాన్ని పాక్ లో విడుదల చేయడం లేదని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఐ.ఎం.జి.సి.గ్లోబెల్ తెలియజేసింది. పాక్ లోని ధోని అభిమానులకు ఇది కొంత నిరాశను కలిగించే విషయమే మరి…
సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ధోని బయోపిక్ పాకిస్తాన్‌లో ప్రదర్శింపబడదు. అయితే యూరీ ఉగ్రదాడి ఘటనలో ఇప్పటికే చాలా దేశాలు పాక్ తీరును తప్పుపట్టుతున్నా ఆ దేశం మాత్రం తన వికృత చేష్టలను ఆపకపోవడం విశేషం. కాగా లాహోర్‌కు చెందిన ఓ న్యాయవాది భారతీయ సినిమాలను ప్రదర్శించరాదని ఆదేశించాలంటూ ఈనెల 23న హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు.