ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుండగా చిత్ర ప్రమోషన్‌లో యూనిట్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా హీరో రామ్ సినిమా విశేషాలను తెలియజేశాడు. ఈ సినిమాలో తాను ‘అభి’ అనే పాత్రలో కనిపించనున్నట్టు చెప్పాడు. లైఫ్ ను చాలా ఈజీగా తీసుకునే స్వభావంతో తన పాత్ర ఉంటుందని అన్నాడు.
ఒక్కమాటలో సినిమా గురించి చెప్పాలంటే చిన్నతనం, కాలేజ్ టైమ్, మెచ్యూర్డ్ ఏజ్ అనే మనిషి మూడు దశలను ఈ సినిమాలో చూస్తారు. మనిషి జీవితం ఈ మూడు దశలలో ఎలా తిరుగుతుంది. ఈ దశలలో ఎదురైన అనుభవాలను హీరో ఎలా అధిగమించాడు అనేదే ‘ఉన్నది ఒకటే జిందగీ’ అని రామ్ తెలిపారు.
తాను ఏ సినిమా చేసినా ఆ సినిమాపై గల అంచనాలను గురించి ఎంతమాత్రం పట్టించుకోననీ, నటించడం మాత్రమే తనకి తెలుసునని చెప్పాడు. ఈ సినిమా చేయడం వలన దర్శకుడు కిషోర్ తిరుమలపై తనకి నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చాడు. నిజ జీవితానికి దగ్గరగా వుండే పాత్ర లభించడం వలన, లావణ్య త్రిపాఠి చాలా ఈజీగా చేసేసిందని అన్నాడు. రియల్ లైఫ్ కి భిన్నంగా వుండే పాత్ర కావడం వలన అనుపమ పరమేశ్వరన్ హోమ్ వర్క్ చేయవలసి వచ్చిందని చెప్పాడు.