యాంకర్ సుమ వల్లే…ఇక్కడున్నా..!

190
Anchor Ravi about Suma
- Advertisement -

బుల్లితెర మీద హాట్ యాంక‌ర్ల లిస్ట్‌లో అన‌సూయ‌, ర‌ష్మీ త‌ర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న యాంక‌ర్ యాంక‌ర్ల‌లో శ్రీముఖి ఒక‌రు. గ‌తంలో యాంక‌ర్ ర‌వితో లాస్య చేసిన ప‌లు ప్రోగ్రామ్స్‌కు బుల్లితెర మీద ఎక్క‌డా లేని క్రేజ్ ఉండేది. ఆ తర్వాత  కార‌ణాలు ఏవైనా ర‌వి – లాస్య మ‌ధ్య ఎందుకో పెద్ద గ్యాప్ వ‌చ్చింది. వీరిద్ద‌రు ఇప్పుడు ఎడ‌మొఖం పెడ‌మొఖంగా ఉంటున్నారు.

ర‌వికి జోడీగా లాస్య ప్లేస్‌లో ప‌టాస్ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి వ‌చ్చి చేరింది. ర‌వి అంటేనే అల్ల‌రి..ర‌వికి హాట్ చిన్న‌ది శ్రీముఖి తోడుగా ఉంటే ఇక ఎలాంటి ర‌చ్చ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రు బుల్లితెర షోల్లో ఒరేయ్‌, ఒసేయ్ అంటూ నానా గోల చేస్తుంటారు. ఇంత క్లోజ్‌గా ఉంటోన్న వీరి మధ్య ఎన్నో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని…పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వెలువడ్డాయి.

 anchor-suma
ఈ నేపథ్యంలో ఓ షోలో పాల్గొన్న వీరిద్దరు తమపై గాసిప్స్ రాస్తున్న వారికి చురకలంటించారు. కొంతమంది పనిపాట లేనివారు యు ట్యూబ్‌లో ఇలాంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.  మాపై గాసిప్స్ రాసే వారికి ఓ కుటుంబం ఉంటుందని వారిపై ఇలాంటి పుకార్లు ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.  ఓ దశలో యాంకరింగ్ వదిలేయాలనిపించిందని కానీ

సుమక్క,శ్రీముఖి వల్లే ఇంకా ఇక్కడ ఉన్నానని చెప్పుకొచ్చాడు రవి.  వీరిద్దరు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేనని వెల్లడించాడు.  ప్రతిసారి మాపై వస్తున్న గాసిప్స్‌పై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. మరి ఇప్పటికైనా గాసిప్స్ రాయుళ్లు తమ గాలివార్తలకు పుల్ స్టాప్‌ పెడతారో లేదో చూడాలి.

- Advertisement -