- Advertisement -
భాషా బేధం లేకుండా ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవి తెరపైకి దూసుకొచ్చింది. ముఖంపై మొటిమలు, చెదరని చిరునవ్వు, పక్కింటి అమ్మాయిలా చూడగానే ఆకట్టుకునే రూపం వంటి అంశాలు సాయి పల్లవికి కలసి వచ్చాయి. ఫిదా కంటే ముందే ప్రేమమ్ సినిమాతో ఆకట్టుకుంది సాయి పల్లవి. తెలుగులో చాలా అవకాశాలు వచ్చిన అన్నింటిని ఒప్పుకోకుండా తగిన పాత్రకోసం వెయిట్ చేసింది. దాని ఫలితమే ఫిదాలో ఆమె భానుమతి పాత్ర. ఫిదా లో భానుమతి పాత్రలో యువత గుండెల్లో సాయి పల్లవి చెరగని ముద్ర వేసుకుంది.
ఫిదా రెండో అట టికెట్ తెగకముందే వెంట నిర్మాతలు పడటానికి పరుగులు తీశారు. ఫిదా సినిమా చూసిన తర్వాత పుష్కలంగా ప్రతిభ ఉన్న సాయి పల్లవి టాలెంట్ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతిలో పడటం ద్వారా నటనపరంగా రాటుదేలింది అని చెప్పాలి. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సాయిపల్లవి ఇకపై తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫిదా టైంలో కూడా వరుణ్ తేజ్ తో చిన్నా మాట మాటా అనుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు నానిని తో సేం రిపీట్ అయ్యిందని కొందరు అంటుంటే, ఎంసిఎ షూటింగ్ లో అలా జరగడంలో నాని ప్రమేయం కూడా ఉందని మరికొందరు అంటున్నారు.
అయితే ఎంసీఏ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా కాబట్టి ఇష్యూ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటికి రాలేదు. దీని వల్లే మనస్తాపం చెందిన సాయి పల్లవి తెలుగు సినిమాలు వద్దు అనుకుందని టాక్. నానితో షూటింగ్ లో ఉన్నప్పుడే చాలా ఆఫర్స్ వస్తున్నా వాటిని కాదని ధనుష్ అట్టర్ ఫ్లాప్ మూవీ మారి సీక్వెల్ కి సైన్ చేసింది సాయి పల్లవి. దీనికి తోడు పెళ్ళైన ఒక యూత్ హీరో తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది అనే వార్తలు కూడా సాయి పల్లవిని కలవరపెడుతున్నాయి. మలయాళం, తమిళంలో ఆఫర్ల వెల్లువ ఉండగా టాలీవుడ్ లోకి రావడం తనదే మిస్టేక్ అని సాయి పల్లవి అన్నట్టు ఫ్రెండ్స్ చెబుతున్నారు. మొత్తానికి సాయి పల్లవి ఇక తెలుగు సినిమాలు చేయదనే వార్తలు ఆమె అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.
- Advertisement -