మహానటిలో కీర్తి ఫస్ట్‌ లుక్‌‌..

213
Keerthy Suresh Look Revealed From Mahanati
- Advertisement -

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి” షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. “ఎవడే సుబ్రహ్మణ్యం” చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ “స్వప్న సినిమా” పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Keerthy Suresh Look Revealed From Mahanati

ఈ మూవీలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్‌ ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతుంది. అయితే ఆ మధ్య.. చిత్రంలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ లుక్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇది ఓ కమర్షియల్ యాడ్ కోసం చేసిందే తప్ప, సావిత్రి లుక్ కాదంటూ కీర్తి క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా మహానటి సెట్స్లో కీర్తి సురేష్, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేలకి సంబంధించిన ఫోటో ఒకటి నెట్లో చక్కర్లు కొట్టింది. ఇందులో కీర్తి, షాలినిలని చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు.

అయితే ఈ రోజు కీర్తి సురేష్ బర్త్ డే కావడంతో మేకర్స్ సావిత్రి లుక్ లో ఉన్న కీర్తి సురేష్ ఫోటోని అఫీషియల్ గా విడుదల చేశారు. ఇందులో కీర్తి అచ్చం సావిత్రి లుక్ లో ఉండడం విశేషం. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న మహానటి చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ, షాలిని, మోహన్ బాబు, దుల్కర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -