అనుష్క‘సూపర్’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ‘సూపర్’ విజయంతో ఇక తను వెనక్కి తిరిగి చూడలేనంత ఆఫర్లు స్వీటీని వరించాయి. అందుకే పదేళ్ళనుంచి ఈ స్వీటీ బిజీ హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తూ తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలుగుతోంది అనుష్క. ‘బాహుబలి -2’ ఘన విజయం తర్వాత జాతీయ స్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
తాజాగా అనుష్క అనుష్క మాట్లాడుతూ.. వినడం ఓ కళ. అందులో నేను మాస్టర్ డిగ్రీ చేశా’ అంటోంది అనుష్క.‘‘స్వతహాగా నాకు ఓపిక ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెబితే శ్రద్ధగా వింటాను. నా స్నేహితులంతా తమ సమస్యల్ని నాకే చెప్పుకొంటుంటారు. నేనేదో వాటిని తీర్చేస్తానని కాదు. కనీసం వాళ్లని అర్థం చేసుకొంటానని. సినిమాల్లోకి వచ్చిన తరవాత కథలు వినడం అలవాటు చేసుకొన్నా. రొటీన్ కథలే చెప్పినా.. కొత్త కథ అన్నట్టు వినేస్తుంటా. ఆఖర్లో నా అభిప్రాయం చెబుతా. వినడం ఎలా తప్పించుకోవాలి? అని ఆలోచించను. పాపం.. ఎంతో కష్టపడి కథ తయారు చేసుకొంటారు. ఆ సినిమా చేయకపోతే చేయలేదు.. కనీసం వింటే ఆ సంతృప్తి అయినా వాళ్లకు మిగులుతుంది కదా’’ అంటోంది.
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ఎపిక్స్ మూవీలో నటించి తనలోని సత్తాని నిరూపించుకున్న అనుష్క ప్రస్తుతం భాగమతి అనే ఉమెన్ సెంట్రిక్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లోనూ అనుష్కకి ఓ కీలకమైనమైన పాత్ర దొరికిందని సమాచారం.