ఓ హీరోయిన్..అక్టోబర్ 15 అనగానే అమ్మో అంటోంది. ‘గూగుల్’ను సైతం దుమ్మెత్తి పోస్తోంది. ఆ హీరోయినే..నివేదా థామస్. జెంటిల్‌మేన్, నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన హీరోయిన్ ఈమె.
అయితే… ఫేవరెట్ హీరోయిన్ పుట్టిన రోజు అంటే.. ఫ్యాన్స్ వెల్లువలా బర్త్‌డే విషెస్ చెప్పడం మామూలే. సోషల్ మీడియా వచ్చాక అది మరింత సులభమైపోయింది. దాంతో అక్టోబరు 15 రాగానే నివేదాకు వెల్లువలా పుట్టిన రోజు విషెస్ వస్తున్నాయి.
అయితే.. ఇవేదా మాత్రం తెగ బాధపడిపోతోంది. ఆమె బాధ విషెస్ గురించి కాదు. గూగుల్‌లోని వీకీపీడియా చేసిన తప్పిదం గురించి. అందులో ఆమె బర్త్‌డే అక్టోబరు 15 అని ఉంది. దీంతో, ఆదివారం ఆమెకు అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ఆమె ట్వీట్ చేయక తప్పలేదు. ‘‘నన్ను విష్ చేయడానికి మీ సమయం వెచ్చిస్తున్నారు.
ఈ రోజు నా పుట్టిన రోజు కాదు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే’’ అని పేర్కొంది. ఆ పోస్ట్ చూసిన అభిమానుల ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది. అయితే, తన పుట్టిన రోజు నవంబరు 2న అని నివేదా గతేడాదే స్పష్టత ఇచ్చింది. మరి, ఆ విషయం ఎంతమందికి గుర్తుందో..!