‘రాజా ది గ్రేట్’ ప్రి రిలీజ్‌..

198
- Advertisement -

మాస్‌ మహరాజా రవితేజ చాలాకాలం ‘రాజా ది గ్రేట్’ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించనుండటంతో సినిమా పోస్టర్‌ దగ్గరి నుంచి టీజర్,ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘రాజా ది గ్రేట్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ లభించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ నాయికగా నటించింది.14న సాయంత్రం రాజా ది గ్రేట్ ప్రి రిలీజ్‌ ఫంక్షన్ జరుపుకుంది.

Raja the Great Movie Pre Release Event

ఈసందర్బంగా హీరో రవితేజ మాట్లాడుతూ..‘‘సాయికార్తీక్‌ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చాడు. తనతో నేను పనిచేయడం ఇదే మొదటిసారి. అలాగే మోహనకృష్ణ కెమెరా పనితనం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ ప్రత్యేకమైన కాన్సెప్టుతో పోరాట ఘట్టాలు తీర్చిదిద్డాడు. తను రామ్‌లక్ష్మణ్‌ అన్నయ్య కొడుకు. బాగా చేశాడు. రాజేంద్రప్రసాద్‌, రాధికల నుంచి చాలా నేర్చుకొన్నా. నిర్మాతలు చాలా మంది ఉంటారు, మేకర్స్‌ తక్కువ మందే ఉంటారు. దిల్‌రాజు మంచి మేకర్‌. సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడతారు. శిరీష్‌ ఏదైనా నిజాయతీగా చెబుతారు.

Raja the Great Movie Pre Release Event

మెహరీన్‌ అందంగా ఉంటుంది. తనకి మంచి భవిష్యత్తు ఉంది. చిన్న వయసులోనే ఎంతో ఎనర్జీతో పనిచేస్తుంటాడు అనిల్‌ రావిపూడి. తను కథ చెప్పిన విధానం, తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. తను చెప్పిన దాంట్లో సగం చేసినా నాకు ఎంతో పేరొస్తుంది’’ అన్నారు. ‘నేనీ ఈ స్థాయిలో ఉన్నానంటే దర్శకులే కారణం’ అన్నారు రవితేజ. ఇక అభిమానుల్ని ఉద్దేశించి ‘దీపావళికి వచ్చి థియేటర్స్‌లో నాకు వినపడండి’ అని చమత్కారంగా అన్నారు.

దాదాపు రెండేళ్ల తర్వాత రవితేజ రాజాది గ్రేట్‌గా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బెంగాల టైగర్’ ఫ్లాప్‌తో డీలా పడ్డా రవి… ఈ సినిమాతో తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడుతుందనే విశ్వాసంతో ఉన్నాడు. సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాతగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా ఉండటంతో సినిమా హిట్ కొట్టినట్లేనని అంతా భావిస్తున్నారు.

- Advertisement -