నేడు పట్నా యూనివర్సిటీ శత వసంత ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వేధికను పంచుకున్న నితీష్ మాట్లాడుతూ ‘ఈ యూనివర్సిటీకి కేంద్ర గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మన ప్రధాని మనతో ఉన్నారు. ఇది గొప్ప అవకాశం. నేను చేతులు నమస్కరించి ప్రాధేయపడుతున్నాను.. మోదీజీ ఈ డిమాండ్‌ను నెరవేర్చండి’ అని అన్నారు.
దీనిపై మోదీ స్పందించిన మోదీ…పాట్నా యూనివర్సిటీలో చదివిన చాలా మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారని, ఈ యూనివర్సిటీలో చదివిన వారు ప్రతి రాష్ట్రంలో ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారని, అలాంటి పాట్నా వర్సిటీకి కేంద్ర గుర్తింపుకంటే ఎక్కువ కావాలన్నారు.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోని 20 యూనివర్సిటీలను వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలుగా మార్చబోతున్నామని, వాటిల్లో పట్నా కూడా ఉంటుందని హామీ ఇచ్చారు మోదీ. అయితే.. మోదీ ఇచ్చిన హామీలకు సంతృప్తి చెందని ఆర్జేడీ వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. మోదీ అసలు విషయాన్ని పక్కదారి పట్టించి, నితీష్‌ను వెర్రివాడిని చేశారని ఆరోపించింది.