మెగా హీరోపై రూమర్స్…

226
Rumors on Sai Dharam Tej
- Advertisement -

మాస్ మహరాజా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. చాలాకాలం గ్యాప్ తీసుకుని రవితేజ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. దీపావళి కానుకగా 18న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించనుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

అయితే, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఓ అతిథిపాత్రను పోషించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా యూనిట్ తో సాయి ధరమ్ తేజ్ కలసి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై దర్శకుడు అనిల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కేవలం రాశీఖన్నా మాత్రమే అతిథి పాత్రను పోషించిందని… సాయి సరదాగానే సెట్ కు వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో తీసుకున్న సెల్ఫీనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిందని చెప్పాడు.

సాయి ధరమ్  ప్రస్తుతం  బీవీఎస్ రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ‘మెహ్రీన్ ఫిర్జాదా’ హీరోయిన్ గా నటిస్తోంది.  జవాన్‌తో హిట్ కొట్టేందుకు తేజ్ తహతహలాడుతున్నాడు.

- Advertisement -