హ్యాపీ బర్త్‌ డే..బడా స్టార్…

226
Amitabh Bachchan's 75th birthday
- Advertisement -

బాలీవుడ్ స్టార్స్‌లో బడా స్టార్ ఎవరంటే అందరికన్నా ముందుగా గుర్తుకొచ్చే పేరు అమితాబ్ బచ్చన్‌దే.   ఇవాళ ఆయన 75వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు.  బాలీవుడ్ స్టార్స్‌లో బడా స్టార్ గా ఎదిగిన బిగ్‌బీకి… ఈ స్టార్ స్టేటస్ అంత ఈజీగా వచ్చింది కాదు. అమితాబ్ మొట్టమొదటిసారి సినీ పరిశ్రమలోకొచ్చిన కొత్తలో ఆయన నటించిన సినిమా పేరు సాత్ హిందుస్థానీ. ఈ సినిమాలో ఏడుగురు హీరోల్లో అమితాబ్ ఒకరు.

ఏడుగురిలో తనది ఒక పాత్ర కావడంతో అమితాబ్ పర్‌ఫార్మెన్స్ గుంపులో గోవిందం అన్నమాదిరిగానే అయిపోయింది. నటుడిగా సాత్ హిందుస్థానీ బిగ్ బీకి పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత సునీల్ దల్ డైరెక్ట్ చేసి, నిర్మిస్తూ, నటించిన రేష్మ ఔర్ షేరా సినిమాలో అమితాబ్‌కి నటించే అవకాశం వరించింది.

  Amitabh Bachchan's 75th birthday

ఇక కెరీర్ ఆరంభంలో…రేష్మ ఔర్ షేరా సినిమాలో బిగ్ బీకి అవకాశం రావడానికి ఓ కారణం వుందట. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సినీనటుడు సునీల్ దత్ భార్య అయిన నర్గీస్ దత్‌కి ఓ లేఖ రాస్తూ… అమితాబ్ బచ్చన్ పేరుని సిఫార్సు చేస్తూ ఇతడికి సినిమాల్లో అవకాశం కల్పించాల్సిందిగా ఆ లేఖలో నర్గీస్ దత్‌ని కోరారట. అలా 1971లో విడుదలైన రేష్మ ఔర్ షేరా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశాన్ని దక్కించుకున్నారట అమితాబ్.

అలా సినీ కెరీర్ లో అవకాశాలు అందిపుచ్చుకున్న బిగ్‌ బీకి 1973లో ప్రముఖ ఫిలింమేకర్ ప్రకాశ్ మెహ్రా డైరెక్ట్ చేసిన జంజీర్ సినిమాలో హీరోగా నటించే అవకాశం  తలుపుతట్టింది. దాదాపు 12 చిత్రాలు భారీ డిజాష్టర్లుగా మిగిలిన తర్వాత అమితాబ్‌ని వరించిన జంజీర్ సినిమా అతడి కెరీర్‌ని అనుకోని మలుపుతిప్పింది. పరాజయం ఎప్పుడూ శాశ్వతం కాదు.. పోరాడితే పోయేదేం లేదు పరాజయం తప్ప అని అమితాబ్‌కి జీవితం పాఠాలు నేర్పిన సమయం అది.

  Amitabh Bachchan's 75th birthday

జంజీర్ సినిమా తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అమితాబ్‌కి రాలేదు. కెరీర్ ఆరంభంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కష్టపడిన అమితాబ్ ఆ తర్వాత అనతి కాలంలోనే 1970-80వ దశకంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత యాక్టింగ్‌లో లెజెండ్ అనిపించుకున్నారు.  అమితాబ్ కెరీర్‌లో అవార్డులు, రివార్డులకి కొదువ లేదు. అమితాబ్‌కి నాలుగుసార్లు నేషనల్ అవార్డ్స్ వరించగా దాదాపు నలభైసార్లు బిగ్ బి పేరు నామినేషన్స్‌కి దాఖలైంది.

నటుడిగానే కాకుండా పలు చిత్రాల్లో పాటలు పాడి, కౌన్ బనేగా కరోడ్‌పతి, బిగ్ బాస్ లాంటి టీవీ షోలకు హోస్ట్‌గా, చిత్ర నిర్మాతగా పలు హోదాల్లో పనిచేసి హమ్ కిసీసే కమ్ నహీ అనిపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బిగ్ బి అమితాబ్ బచ్చన్. మొత్తానికి యావత్ దేశం అభిమానించే మన బాలీవుడ్ లెజెండ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనకు మున్ముందు మరింత వినోదాన్ని పంచాలని మనసారా కోరుకుంటూ బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది www.greattelangana.com

- Advertisement -