జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోసారి తండ్రయ్యారు. ఈరోజు ఉదయం ఆయనకు తన ప్రస్తుత భార్య అన్నా లెజినోవా ద్వారా హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో పండంటి కొడుకు పుట్టాడని తెలుస్తోంది. తన మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా పవన్ కళ్యాణ్ కు ఆల్రెడీ అకీరా మరియు ఆద్య అంటూ ఇద్దరు సంతానం ఉన్నారు. ఆ తరువాత ఆయన ఆస్ర్టేలియాకు చెందిన రష్యన్ వనిత అన్నా లెజినోవాను పెళ్ళిచేసుకున్నారు పవన్. ఈ జోడీకి ఆల్రెడీ పొలేనా అనే మూడేళ్ల కూతురు ఉంది.
ఈ మధ్యన ఈ పిల్ల పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల దగ్గర కూడా కనిపిస్తోంది. అలాగే అన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిగే ఫంక్షన్లలో దర్శమిస్తున్నారు. ఇప్పుడు వీరికి ఒక మగబిడ్డ జన్మించడం మెగా కుటుంబంలో మరో వేడుకలా మారిందనే చెప్పాలి. ఇక సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న ”అజ్ఞాతవాసి” షూటింగులో ఉన్నారు. త్వరలోనే ఆయన పాటల షూటింగ్ నిమిత్తం యురోప్ వెళుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతులో ఉన్న తన కొడుకు ఫోటో సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.