క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఒక బాల్ వేయడానికి ఏకంగా ఐదు సార్లు ట్రయల్ తీసుకున్నాడు ఈ బౌలర్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్ -శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇన్నింగ్స్ 111వ ఓవర్ వేస్తున్న రియాజ్ నాలుగో బంతిని వేసేందుకు రావడం.. నిలిచిపోవడం.. రావడం నిలిచిపోవడం.. అలా ఐదుసార్లు ప్రయత్నించి చివరికి ఆరోసారి విజయవంతమయ్యాడు. వాహబ్ చేసిన చేష్టలకు అందరూ విసిగిపోయారు.
ఆ దేశ క్రికెట్ అభిమానులే వాహబ్‌ని ఏకి పారేస్తున్నారు. బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటిస్తున్నారు. పాక్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా వాహబ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.మ్యాచ్ చూడకుండా గ్యాలరీ నుంచి డ్రస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లిపోయాడు. మైదానంలో ఉన్న పాక్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్ పాటు బ్యాట్స్‌మెన్లు, అంపైర్లు రియాజ్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఆ తర్వాత విజృంభించిన రియాజ్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
https://twitter.com/iPakistaniLAD/status/916653853466157057