స్పీచ్ ఇరగదీసిన రవితేజ..

184
Raviteja Speech at Raja The Great Movie Trailer Launch
- Advertisement -

మాస్‌ మహరాజా రవితేజ చాలాకాలం తర్వత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్దమౌతున్నాడు. ఈ మూవీ ఈ నెల 19వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించబోతున్నాడు. కథానాయికగా మెహ్రీన్ అలరించనుంది. తాజాగా ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ .. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని అన్నారు.

Mass Maharaj Raviteja Superb Speech

ఇక ఈ సినిమాలో ‘రాజేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే రాధికతో పని చేసే అవకాశం లభించింది. ఈ అనుభవాన్ని మర్చిపోలేను. సాయికార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ జర్నీ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ చిత్రంతో హ్యాట్రిక్ లభించాలని కోరుకుంటున్నాను. తను ఫుల్ ఎనర్జిటిక్ పర్సన్. తన ఎనర్జీలో సగం ఉన్నా నేను సక్సెస్ అయినట్లే అనిపించింది.

హీరోయిన్‌ గురించి మాట్లాడుతూ..మెహ్రీన్ అంకితభావం చూస్తే తనకి చాలా ఆశ్చర్యం వేసేసిందనీ, మరో రెండు సినిమాలు చేసే సరికి ఆమె పూర్తిగా తెలుగు నేర్చేసుకోవడం ఖాయమని అన్నారు. గ్లామర్ తో పాటు మంచి నటనా సామర్థ్యం వున్న మెహ్రీన్, తెలుగులో జెండా పాతేయడం ఖాయమని చెప్పారు. దిల్ రాజు చెప్పినట్టుగా ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -