సింగరేణిలో తిరుగులేని టీబీజీకేఎస్‌…

238
SCCL union polls: TBGKS reand victory
- Advertisement -

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. బొగ్గు బావుల్లో గులాబీ జెండా రెపరెపలాడించిన కార్మికులు భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ను గెలిపించారు. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. గత ఎన్నికల్లో 6 ఏరియాల్లో గెలిచిన టీబీజీకేఎస్‌ ఈ సారి ఏకంగా 9 చోట్ల గెలిచి సత్తా చాటింది. మిగిలిన రెండు చోట్ల ఏఐటీయూసీ గెలిచింది.

కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు పోల్‌కాగా.. ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ విజయదుందుభి మోగించింది.

రామగుండం–1లో 6,876 ఓట్లకుగాను 6,476 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 366 ఓట్ల మెజార్టీతో విజయం.

రామగుండం–2లో 4,221 ఓట్లకుగాను 4,000 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 764 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది.

రామగుండం–3లో 5,367 ఓట్లకుగాను 5,004 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.

శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్‌ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది.

మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్‌ గెలుపొందింది.

బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది.

మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ  800 ఓట్ల మెజార్టీతో గెలిచింది.

భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.

- Advertisement -