ఆయన వయస్సు 58…అయినా అభిమానులకు, ప్రేక్షకులకు మాత్రం ఆయన ఎప్పటికీ యువసామ్రాటే. కొడుకులిద్దరూ సినిమాల్లో సత్తా చాటుతున్నా.. వాళ్లతో పోటీకీ ఆయన ఎప్పుడూ సిద్ధమే..! మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో టాలీవుడ్ యంగ్ హీరోలకే పోటీ ఇచ్చిన నాగ్.. ప్రస్తుతం రాజు గారి గది 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగ్ సరికొత్త లుక్‌ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ మీసంకట్టుతో అందంగా కనిపించే నాగ్….ఒక్కసారిగా మీసం తీసేసి కొత్త లుక్‌తో ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాకయ్యారు. ముఖ్యంగా మహాభారతలో కర్ణుడు పాత్ర కోసం మీసాలు తీసేశారని టీ టౌన్‌లో ప్రచారం జరిగింది.
అయితే ఈ గాలి వార్తలన్నింటినీ నాగ్ ఒక్క మాటతో తుడిచేశారు. వచ్చే మూడు నెలల్లో నాకు ఎలాంటి షూటింగ్‌లు లేకపోవడంతో కొత్తగా ఏదైనా చేద్దామని మీసాలు తీసేసినట్లు తెలిపారు.
అంతేకాదు.. ఈ కొత్త లుక్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు ఈ టాలీవుడ్ మన్మథుడు. ఇక మొత్తానికి నాగ్ తన న్యూలుక్‌పై క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పడినట్లైంది.