గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన షారూఖ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ల జంట మరో చిత్రంలో కలసి నటించాలని వచ్చిన ప్రతిపాదనలను అంగీకరించడం లేదట.
తాను నటించాలంటే, హీరో ఎవరైనా, ఒక్క రొమాంటిక్ సీన్ కూడా ఉండరాదని ఐశ్వర్య షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ తనకు నచ్చిన, నప్పేలా ఉండే రోల్స్ ఎంచుకుంటున్న ఐశ్వర్యను, షారూఖ్ నూ మరోసారి కలపాలని మూడు నిర్మాణ సంస్థలు ఆఫర్లు ఇచ్చాయట.
ఇక తాజాగా ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రంలో ఈ జంట చివరిసారిగా కనిపించగా, అప్పటి నుంచి షారూఖ్ కూడా ఐశ్వర్యతో కలసి వెండితెరను పంచుకునేందుకు అంగీకరించడం లేదని సమాచారం.
కారణం ఏంటన్న విషయం తెలియకున్నా ఆన్ స్క్రీన్ రొమాన్స్ తనకు వద్దని ఈ బిగ్ బీ కోడలు తనను కలిసిన నిర్మాతలకు గట్టిగానే చెబుతోందట. తమ ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే, కలసి నటించేందుకు మాత్రం అంగీకారం తెలపడం లేదట. ఇక ఈ విషయంలో నిజాలు తెలియాలంటే, అటు ఐశ్వర్యో, ఇటు షారూఖో నోరు విప్పాల్సిందే.