స్టార్ హీరోల సినిమాల మధ్య దూరిపోతూ హిట్ మీద హిట్ కొట్టేస్తున్న శర్వానంద్, ఈ దసరాకు కూడా అదే పని చేశాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’, మహేశ్ బాబు ‘స్పైడర్’ చిత్రాల మధ్య శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది, అలాగే విదేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. వాటి రిపోర్టు పాజిటివ్ గానే వస్తోంది.
ఈ సినిమాలో హీరో..తన మనసుకు నచ్చిన అమ్మాయికి ముద్దు పెట్టాలన్నా కూడా అతి శుభ్రత పాటించే వ్యక్తిగా, గుడిలోకి వెళ్లాలన్నా కూడా కాళ్లకు మట్టి అంటుతుందన్న ఉద్దేశంతో సాక్స్ తో వెళ్లిపోయే వాడిగా శర్వానంద్ బాగా నటించాడని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ప్రేయసి ఇంటికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్న విషయాన్ని వినోదం మిస్ కాకుండా దర్శకుడు మారుతి తెరకెక్కించాడని, దసరాకు శర్వానంద్ హిట్ కొట్టినట్టేనని అంటున్నారు.
సాంకేతిక విభాగం :
విడుదల తేదీ:29/09/2017
రేటింగ్ :3/5
నటీనటులు: శర్వానంద్, మెహరిన్ పిర్జాద
సంగీతం: యస్ యస్ తమన్
నిర్మాత: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి
దర్శకత్వం: మారుతీ