మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదట్లో కొంచెం తడబడ్డా.. తర్వాత వరుస విజయాలతో మెగా ఫ్యాన్స్ కి చాలా దగ్గరయ్యడు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ – సుప్రీమ్ సినిమాలు కెరీర్ కు మంచి ఎనర్జీ ఇచ్చాయి. అయితే ఆ తర్వాత కథల లోపంతో సాయి కొంచెం తొందరపడి అపజయల్ని అందుకున్నాడు. అయినా సరే సాయి ఎనర్జీ కి తగ్గట్టు కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం జవాన్ సినిమాతో బిజీగా ఉన్న సాయి త్వరలోనే ఆ సినిమాను రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు.
గోపిచంద్ – వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత బివిఎస్.రవి.. జవాన్ ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ సినిమా విడుదల అవ్వకముందే సాయి వివి.వినాయక్ సినిమాని ఒకే చేశాడు. రీసెంట్ గా ఆ చిత్రం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. మొన్నటి వరకు సినిమాకి సంబందించిన టైటిల్ విషయంలో తడబడ్డా చిత్రయూనిట్ మొత్తానికి ‘ఇంటిలిజెంట్’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. అలాగే హీరోయిన్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. దీంతో దానికి కూడా చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. ఇంటిలిజెంట్ బాబుకు జోడీగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ని ఫైనల్ చేశారు.
లావణ్య కి ఇది నిజంగా లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె వరుస పరాజయలతో సతమతమవుతోంది. అలాగే రీసెంట్ గా అమ్మడి వ్యవహార శైలి వల్ల రెండు సినిమాల నుంచి తప్పించేశారని వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మడికి మంచి ఆఫర్ వచ్చినట్లే. పైగా వివి.వినాయక్ చేతిలో పడితే పక్క హీరోయిన్స్ పాపులర్ అవ్వాల్సిందే. మరి లావణ్యకి ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని ఇస్తుందో చూడాలి.