- Advertisement -
బెంగళూరు వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరుతో ఆతిథ్య భారత్‌కి సవాల్ విసిరింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 334 పరుగులు చేసింది.
డేవిడ్ వార్నర్ 124 ( 119 బంతుల్లో), ఫించ్ 94 (96), ట్రావిస్ హెడ్ 29 (38), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 3 (5), పెటెర్ హ్యాండ్స్కాంబ్ 43 (30), మార్కస్ స్టోయినిస్ 15 (9) నాటౌట్, మ్యాథ్యూ వేడ్ 3 (3) నాటౌట్ పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు తీయగా, కేదార్ జాదవ్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్‌కి ఎక్స్‌ట్రాల రూపంలో 23 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది.
- Advertisement -