త్వరలో ఫేస్‌బుక్‌ పై నిషేధం..?

231
- Advertisement -

2018 లో ఫేస్ బుక్ పై నిషేధం విధిస్తామని రష్యా టెలికాం సంస్థ అధినేత అలెగ్జాండర్ ఝరోవ్ హెచ్చరించారు. తమ చట్టాలకు వ్యతిరేకంగా పేస్ బుక్ పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.

అలెగ్జాండర్ ఝరోవ్ మీడియాతో మాట్లాడుతూ.. విదేశీ మెసేజింగ్‌ సర్వీసులు, సెర్చ్‌ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్‌ సైట్లు నిబంధనలకు విరుద్ధంగా రష్యన్‌ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నాయని అన్నారు.

  Russia threatens to ban Facebook in 2018

గతంలో రష్యాలో రూపొందిచిన నిబంధనల ప్రకారం రష్యన్లకు సంబంధించిన సమాచారాన్ని రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

కానీ సోషల్ మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు ఈ నిబంధనలను అధికమించి వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండా తీసుకుంటున్నాయని ఆరోపించారు.

 Russia threatens to ban Facebook in 2018

ఈ క్రమంలోనే  తమ డిమాండ్స్ అంగీకరించకపోతే 2018లో పేస్ బుక్ పై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే లింక్డ్ ఇన్ తమదేశంలో నిషేధం ఎదుర్కొంటోందని అలెగ్జాండర్ ఝరోవ్ గుర్తు చేశారు.

- Advertisement -