త్వరలోనే నాగ చైతన్య -సమంతలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత సోషల్‌మీడియాలో హాట్ హాట్‌గా కనిపిస్తోంది. సమంతా ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసినట్లు అనిపిస్తోంది.మరి ఈ ఘాటు ఫోటో షోట్ ఇప్పుడు అవసరమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు కొందరు.
ఇకపోతే సమంత-చైతుల వివాహం గోవాలో అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనుండగా, హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు తాను ధరించే లెహంగా ఇదే అవుతుందేమోనని లెహంగా ధరించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. లేత చందనపు రంగులో వున్న లెహంగాలో సమంత లుక్ యమ హాటుగా వుంది.
ఇదే తన పెళ్లికి ధరించే లెహంగా అవుతుందనకుంటానని.. తాను ధరించిన ఈ లెహంగాను రూపొందించిన డిజైనర్ క్రేషా బజాన్‌ను సమంత ప్రశంసలతో ముంచెత్తింది. సమంత నిశ్చితార్థ వేడుకలో క్రేషా డిజైన్ చేసిన చీరనే ధరించింది.
ఈ చీరలో అక్కినేని నాగచైతన్యతో తనకున్న ప్రేమాయణం సంబంధించిన జ్ఞాపకాలను అందులో ప్రింట్ చేయించింది. ప్రస్తుతం అదే రంగులో క్రేషా రూపొందించిన లెహంగాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..!