డిఫరెంట్ కథలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవల నందమూరి బాలయ్యతో పైసా వసూల్ సినిమా తీసి ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫ్లాప్ వచ్చినా.. హిట్ వచ్చినా.. పట్టించుకోని పూరీ.. తన తరువాత సినిమా తన కుమారుడు ఆకాష్ పూరీతో చేస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తనయుడితో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో వున్నాడు పూరీ.
ఇక బాలయ్య కూడా పైసా వసూల్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా పూరీతో మరో సినిమాకు ఓకే చెప్పినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజమెంతుందో ఎవరు క్లారీటీ ఇవ్వలేదు. అయితే బాలకృష్ణ కూడా తన వారసుడి ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మోక్షజ్ఙను ఎవరి చేతిలో పెడితో క్లిక్ అవుతాడో బాలయ్య తెగ హైరానా పడుతున్నాడట. ఇటీవల బాలకృష్ణ ఒక సందర్భంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది మోక్షజ్ఞ మూవీని లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని భారీ ఫైటింగ్స్, ఛేజింగ్స్ తో తీయోద్దని, యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడట.
తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా బాధ్యతను ఆయన పూరీ జగన్నాథ్ కి అప్పగించే ఆలోచనలో ఉన్నాడట. అయితే, పైసా వసూల్ సమయంలో పూరీ టేకింగ్, డైరెక్షన్ కు బాలయ్య మెస్మరైజ్ అయ్యాడట. ఆ సినిమాలో బాలయ్యను యంగ్ హీరోలా చూపించిన పూరీకి బాలయ్య బాగా కనెక్ట్ అయ్యాడట. అందుకే, మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతలను పూరీ భుజస్కంధాల మీద వెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తనయుడితో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో ఉండగా… ఆ ప్రాజెక్టు తరువాత ఆయన బాలకృష్ణ తనయుడి సినిమాను చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.