ఒకప్పుడు వందకోట్ల కలెక్షన్లు అంటే ఊహకందని విషయమే. కానీ, సినిమాలు వంద రోజులు మాత్రం ఆడేవి. ఇప్పుడు వందరోజుల మాట అటుంచితే రెండు మూడు వారాల్లోనే సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. ఈ విషయంలో టాలీవుడ్ ని బాహుబలి ముందు బాహుబలి తరువాత అని డివైడ్ చేసి చూడొచ్చు.
బాహుబలి రిలీజ్ ముందు వరకు అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటిని బీట్ చేసి, మగధీర మూవీ టాప్ ప్లేస్ లో సెటిల్ అయింది. అప్పట్లో మగధీర కలెక్షన్లు 72 కోట్లు. కానీ, బాహుబలి రాకతో చరణ్ మగధీర టాప్ ప్లేస్ కోల్పోయింది. ఏకంగా 180 కోట్లు వసూలు చేసి బాహుబలి మూవీ టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తరువాత అత్తారింటికి దారేది, శ్రీమంతుడు వరుసపెట్టి రికార్డులు సృష్టించాయి. శ్రీమంతుడు 86 కోట్లు, అత్తారింటికి దారేది 74కోట్లు వసూలు చేశాయి. ఈ కలెక్షన్ల వరదలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతయ్యాయి.
ఈ క్రమంలో రీసెంట్ గా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రికార్డుల సునామీనే సృష్టించింది. బాగాలేదన్న టాక్ లోనూ కేవలం మూడు వారాల్లోనే 110 కోట్లకుపై కలెక్షన్లు కొల్లగొట్టింది జనతా. కలెక్షన్ల విషయంలో ప్రస్తుతం జనతా గ్యారేజ్ మూడవ స్థానంలో ఉంది. ఇంకా ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుండడంతో త్వరలోనే ఈమూవీ శ్రీమంతుడిని బీట్ చేసి, 2 ప్లేస్ ని ఆక్రమించే అవకాశాలున్నాయి.
జనతా ఎఫెక్ట్ తో టాప్ 5 చిత్రాల్లోనూ చాలా మార్పులు జరిగాయి. మెగా హీరో మూవీ.. మగధీర 5 వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ రేటింగ్స్ కూడా చాలా దిగజారాయి.దీంతో జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ మంచి స్నేహితులైనా… రికార్డుల విషయంలో మెగాఫ్యామిలీలో కాస్త కంగారు మొదలైందని టాక్ వినిబడుతోంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈవిషయంలో డిజప్పాయింట్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల ఆశలన్నీ ప్రస్తుతం రాంచరణ్ ధృవ చిత్రంపైనే ఉన్నాయి. ధృవ ఖచ్ఛితంగా టాలీవుడ్ రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
అయితే రాజమౌళి చిత్రాలతో మరే హీరో మూవీ కూడా పోటీ పడదనే చెప్పాలి. ఈ లెక్కన ఎంత బంపర్ హిట్టు కొట్టినా.. ఇకపై నంబర్ 2గా ప్లేస్ మాత్రమే రిప్లేస్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నంబర్ 1 ను రిప్లేస్ చేయాలంటే అది ఒక్క జక్కన్నకే సాధ్యం. ఈ రకంగా చూస్తే.. రాంచరణ్ నంబర్ 1 లో నిలవాలంటే రాజమౌళితో సినిమా చెయ్యాల్సి ఉంటుంది. జక్కన్న మాత్రం మెగా హీరోలను మగధీరతోనే పక్కన పెట్టేశాడు. మరీ మెగా ఆశ ఎలా నెరవేరుతుందో చూడాలి.