బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె స్వభావంతో బీ టౌన్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అదే క్రమంలో వివాదాలతో కూడా సావాసం చేసే నటిగా కంగనా రనౌత్ చేంజ్ అయిపోయింది.
ఇటీవలే.. హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్, తన వ్యాఖ్యల వల్ల కెరీర్‌కు ముగింపు పలకాల్సిన అవసరం వస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కానీ కంగనా మాత్రం వారి మాటల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు.
ఇదిలా ఉంటే..తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదాయ, వయసు అంతరాలు, అఫైర్లపై గతంలో సంచలన ఆరోపణలు చేసిన కంగనా, ఈ సారి వారి కుటుంబ నిర్ణయాలపై మండిపడింది. పదిహేనేళ్ల అమ్మాయితో గంతులేసే హీరోలు తమ కూతుళ్ళు బికినీలు వేస్తే కాళ్ళు విరగ్గొడతామని వార్నింగులు ఇస్తుంటారని ఎద్దేవా చేస్తూ..కాస్త చురకలంటించింది.
అలాగే తమ కొడుకులను హీరోలుగా నిలబెట్టేందుకు పడరాని పాట్లుపడే హీరోలు, తమ కూతుళ్లను హీరోయిన్లను చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారని ఎద్దేవా చేసింది.
అయితే అందరు హీరోలు అలా లేరని తెలిపింది. తన కుమార్తె బికినీ వేస్తే కాళ్లు విరగ్గొడతానని షారూఖ్ పేర్కొనగా, తన కుమార్తె సినిమాల్లో నటిస్తానంటే కాళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెడతానని సంజయ్ దత్ పేర్కొన్న సంగతి తెలిసిందే.