తల్లైన రెజీనా !

306
regina_cassandra-
- Advertisement -

రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా.. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస విజయాలు రెజీనాను పలుకరించాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ.. దాదాపు కుర్ర హీరోయిలందరితో జోడి కట్టింది. ఈ మధ్యనే వచ్చిన నక్షత్రం కోసం ఎంతగా అందాలను ఆరబోసినా కూడా సినిమా మిస్ ఫైర్ అయ్యింది. ఇంతలో ఓ మెగా హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ప్రేమ, పెళ్లి అంశాల మధ్య రెజీనా నలిగిపోయిందని, ఆమె స్టార్‌డమ్‌కు గండిపడిందని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే రెజీనా ఇప్పుడు తల్లైందట. ఇది రూమర్ కాదు..

ఈ విషయాన్ని రెజీనా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చెప్పింది. అంతేకాదు తన పాప ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే రెజీనా అమ్మయితే అయిందిగానీ.. అది దేవుడిచ్చిన బిడ్డతో. ఆ పాప పేరు జోలీ డేనియల్ అని, ఆమె తనకు దేవుడిచ్చిన కూతురు అని రెజీనా చెప్పింది. గాడ్‌మదర్‌గా ఇక తాను కూడా మంచి అమ్మలా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తానంటున్నది ఈ స్టార్ హీరోయిన్. ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లందరూ అగ్రతారలుగా కొనసాగడం విశేషం.

- Advertisement -