- Advertisement -
దోమలను నిర్మూలించాలంటూ దాఖలైన ఓ అసాధారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పని దేవుళ్లకే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించింది. దేశంలో దోమలను నిర్మూలించే దిశగా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ధనేశ్ లేష్‌ధన్ అనే వ్యక్తి భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు.
పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దోమలను నిర్మూలించడం దేవుళ్లకే సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని పనులు కోర్టులు చేయలేవు….మేము దేవుళ్లం కాదు.. దేవుళ్లు చేసే పనులను తమను చేయమని అడగొద్దని కోర్టు తెలిపింది.
దోమలను నిర్మూలించాలని అధికారులను ఏ కోర్టు ఆదేశించలేదని పేర్కొంది. దేశంలోని ప్రతి ఇంటికి వెళ్లి.. మీ ఇంట్లో ఈగ, దోమలు ఉన్నాయి…వాటిని నిర్మూలించండి అని చెప్పలేం కదా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
- Advertisement -