డాన్స్‌ ఇరగదీసిన కలెక్టర్‌ అమ్రాపాలి

342
Collector Amrapali Kata dance video
Collector Amrapali Kata dance video
- Advertisement -

అందం.. అనుకువ.. ధైర్యం.. తెగువ.. ఇవన్నీ కలగలిసి ఉన్న యువ కలెక్టర్‌.. అమ్రాపాలి. మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినందుకు మొదటిసారి వార్తల్లో వ్యక్తి అయిన ఆమ్రపాలి.. తరువాత ఒడిలో వినాయకున్ని పెట్టుకుని కూర్చున్నట్టున్న విగ్రహంతో వార్తల్లోకెక్కారు.. ఇటీవల పాండవుల గుట్టను ఎక్కినా ఈమె.. అప్పట్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు చేసినా డ్యాన్స్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపింది. తాజాగా అమ్రాపాలికి సంబంధించిన మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ వీడియో అమ్రపాలి చదువుకునే రోజుల్లో తీసినట్టుగా తెలుస్తోంది. సహ విద్యార్థితో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న సాంగ్ మాత్రం 2008-09లో విడుదలైన తమిళ స్టార్ హీర్ విజయ్ ‘విల్లు’ సినిమాలోనిదిగా తెలుస్తోంది. దీన్నిబట్టి అమ్రపాలి బెంగళూరు ఐఐఎంలో పీజీ డిప్లోమా చేస్తున్న సమయంలో జరిగిన ఈవెంట్ అయి ఉండవచ్చునని లేదా ఆమె సివిల్ సర్వీస్‌ అకాడమీలో అయ్యుంటుందని అంటున్నారు. ఏదేమైనా అమ్రపాలి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎదేమైనా ఆమెలో ఒక మంచి డ్యాన్సర్ ఉందని ఈ వీడియో మరోసారి భయటపడింది..ఆ వీడియోపై ఒక లుక్కేయండి..

- Advertisement -