కొద్దిరోజుల క్రితం గుత్తా జ్వాలా ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. ట్విట్టర్లో చిన్నపాటి మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. అందులో జ్వాలా తన సోదరితో కలిసి పాట పాడుతూ ఉండగా.. వారి తల్లి ఇన్సి గుత్తా కూడా వీడియోలో కనిపిస్తారు.ఈ వీడియోని చూసిన ఓ నెటిజన్ మీరు యాంటీ నేషనల్, యాంటీ మోడీ అని ఆరోపించాడు. దీంతో గుత్తా జ్వాల నువ్వు ఏదైనా అడగదలుచుకుంటే నేరుగా ప్రశ్నించు. మన మధ్య సంభాషణల్లో నా తల్లిదండ్రుల గురించి ప్రస్తావన తీసుకువస్తే.. నాలో మరో కోణం చూస్తావు. గుర్తుపెట్టుకోమంటూ గుత్తా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.
తాజాగా గుత్తా జ్వాల సోషల్ మీడియా ఖాతాలో హాట్ ఫోటో ఒకటి పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల విమర్శించే వాళ్లని విమర్శించనీ…ముందైతే ఒక సెల్ఫీ దిగనీ అంటూ డోంట్ కేర్ ట్రోలర్స్, లవ్ యువర్ సెల్ఫ్, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీల హ్యాష్ ట్యాగ్ తగిలించి, ఒక హాట్ ఫోటో పోస్టు చేసింది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల వస్త్రధారణను విమర్శిస్తూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోటో పెట్టి మరో చర్చకి తెర తీసింది గుత్తా జ్వాలా.
Haters can hate….but first let me click a selfie 😝 #dontcarefortrollers #loveurself #spreadlove #positivity pic.twitter.com/C7MVj2uLIR
— Gutta Jwala (@Guttajwala) September 22, 2017