మెక్సికోను మరోసారి భూకంపం వణికించింది. నేటి తెల్లవారుజామున మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డయింది. దీని ధాటికి మెక్సికో చిగురుటాకులా వణికింది. భవనాలు కుప్పకూలిపోయాయి.
మెక్సికో నగరంలోనే అనేక చోట్ల జనం వీధుల్లోకి భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే వెంటనే స్పందించిన ప్రభుత్వం సహాయకచర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ 250 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వేలాది మందికి గాయాలయ్యాయి.
భూకంపం వల్ల గ్యాస్ పైప్‌లైన్లు దెబ్బతిన్నట్లు కూడా అధికారులు అంచనావేస్తున్నారు. క్యూయెర్‌నవాకా ప్రాంతంలోని పాఠశాల భవనం కుప్పకూలింది. దీంతో పాఠశాలలోని చిన్నారులు, ఉపాధ్యాయుల ఆచూకీ తెలియడం లేదు. అయితే మెక్సికోలో వారం రోజుల క్రితమే భారీ భూకంపం సంభవించింది విద్యుత్ లైన్లు, ఫోను లైన్లు అనేకచోట్ల ధ్వంసమయ్యాయి.
సరిగ్గా 32ఏళ్లక్రితం 1985 సెప్టంబరు 19న ఇదే రోజు ఈ నగరంలో భూకంపం సంభవించి 10 వేల మంది చనిపోయారు. ఈ సందర్భంగా మంగళవారం నగరంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు కవాతులు(మాక్‌డ్రిల్స్) నిర్వహించారు. అదిపూర్తయిన కొన్ని గంటలకే తాజా భూకంపం సంభవించింది.
రెండు వారాల వ్యవధిలో మెక్సికోను కుదిపేసిన రెండో భూకంపం వల్ల భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ భూకంపం కారణంగా బిలియన్ల ఆస్తి నష్టం సంభవించిందని, మొత్తం ఆస్తినష్టం అంచనాలు అందేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. పలు సీసీ కెమెరాల్లో రికార్డయిన భవంతుల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Tras sismo, captan explosión dentro de edificio en la Ciudad de México pic.twitter.com/s78hhlijy1
— NMás (@nmas) September 19, 2017
Aquí el momento donde un edificio, al parecer en la Colonia Roma colapsa. pic.twitter.com/rAYKX0lJjm
— REFORMA (@Reforma) September 19, 2017