స్మృతీని ప్రేమలో పడేసింది..!

214
Smriti Met Adnan Sami's Daughter Medina
- Advertisement -

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సోషల్ మీడియాలో ఉన్న  ఫాలోయింగ్‌ అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె  చేస్తున్న ఫొటోలు, వీడియోలు  తెగ క్రేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం టెక్స్‌టైల్స్‌ మంత్రిగా పనిచేస్తున్న ఆమె ఆ శాఖకు సంబంధించిన అంశాలకంటే తన వ్యక్తిగత అంశాలు ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలే పంచుకుంటున్నారు.

Smriti Met Adnan Sami's Daughter Medina
తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓ చిన్నారి ప్రేమలో పడేసింది. తన అందమైన బోసినవ్వులతో ఆమెను బుట్టలో వేసుకున్న ఆ బుజ్జాయి మరెవరో కాదు.. ప్రముఖ గాయకుడు అద్నాన్‌సమి గారాల పట్టి మెదీనా. సోమవారం అద్నాన్‌ సమి తన భార్య, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిని కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సమి ట్విటర్‌లో పోస్టు చేశారు

ఓ చక్కటి చిత్రం వెయ్యి భావాలను పలుకుతుంది. ఇరానీజీ, మెదీనా మధ్య  లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. కృతజ్ఞతలు… అని సమి ఫొటోల కింద క్యాప్షన్‌ రాశారు. ఈ ఫొటోలో బోసినవ్వులు చిందిస్తున్న మెదీనాను ఎత్తుకొని కేంద్రమంత్రి సరదాగా ఆడుకుంటూ కనిపించిన దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

- Advertisement -