ట్రైలర్‌తో అదరగొట్టిన ”మహానుభావుడు”..

201
Mahanubhavudu Theatrical Trailer
- Advertisement -

హీరో శర్వానంద్ ప్రతీసారి కామెడీ ఎంటర్టయినర్‌తో అలరించాలనే చూస్తున్నాడు. అయితే రన్ రాజా రన్ వర్కవుట్ అయ్యాక.. ఆ రేంజులో మరో సినిమా పడలేదు. కాకపోతే ఫ్యామిలీ సినిమా అయిన శతమానం భవతితో పెద్ద హిట్టే కొట్టాడు. ఇప్పుడు మరోసారి కామెడీతో హిట్టుకొట్టాలంటూ మారుతి డైరక్షన్‌లో ”మహానుభావుడు” సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ, హీరో పాత్ర స్వరూప స్వభావాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

Mahanubhavudu Theatrical Trailer

అతి శుభ్రం అనే డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తిగా శర్వానంద్‌ అదరగొట్టేశాడు. దానికితోడు మారుతి కామెడీ తీయడంలో చాలా ఆరితేరినవాడు. అందుకే మనోడు కూడా శర్వానంద్‌ను కరక్టుగా వాడుకుని టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది.

ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే ‘స్పైడర్’ వంటి భారీ సినిమా రిలీజ్ తరువాత రెండవ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడటం, అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -