డబుకు డిబుకు డప్పు అదుర్స్

207
Raja The Great Title Song With Lyrics
Raja The Great Title Song With Lyrics
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ్ హీరోగా వస్తున్న చిత్రం రాజా ది గ్రేట్’ . ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉండేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుండగా రాశీ ఖన్నా కూడా ఒక పాటలో మెరవనుంది.

తాజాగా `రాజా ది గ్రేట్‌` టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌లైంది. `రాజా… రాజా..రాజా` అంటూ ప్రారంభ‌మైన ఈ పాట‌లో కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా కోర‌స్ పాడుతుండ‌టం ఈ వీడియోలో కనిపిస్తుంది. సాయి కార్తీక్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ పాట‌ను రేవంత్‌, సాకేత్‌ల‌తో క‌లిసి ర‌వితేజ కూడా పాడారు. ఈ పాట‌ను శ్యామ్ కాస‌ర్ల ర‌చించారు. సినిమా నిర్మాణ దృశాల్లో ర‌వితేజ కుమారుణ్ని కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో మహాధన్ చిన్నప్పటి రవితేజగా కనిపించనున్నాడు. ఈ మూవీలో అంధుడిగా ర‌వి తేజ క‌నిపించ‌నున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ చిత్రంపై భారీ అంచ‌నాల‌ను పెంచింది.

https://youtu.be/ttYnTpZGPP0

- Advertisement -