భారతీయుడు సీక్వెల్ రాబోతుంది..!

233
Bharateeyudu 2 will soon..!
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.0 సినిమా ప్రొడక్షన్ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ సినిమా రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు జరిగిపోతుండటంతో తన తర్వాతి ప్రాజెక్టుపై శంకర్  దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే భారతీయుడు సినిమాకు సీక్వెల్ వార్త తెరపైకొచ్చింది. సరిగ్గా 2 దశాబ్ధాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది.

అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అంతకుముందు అవినీతి అరికట్టడంపై వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ అవేవీ భారతీయుడు సినిమాలా ఆకట్టుకోలేకపోయాయి. కమల్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేసింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శకుడు శంకర్ కి వుంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఎ.ఎమ్.రత్నం కూడా అందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. కానీ ఎందుకనో ఈ సీక్వెల్ ఆలోచన ఆచరణలోకి రాలేదు.

ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల నుంచి ఇప్పుడందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే భారతీయుడు సీక్వెల్ మొదలయ్యే అవకాశముందట. ఈ విషయమై శంకర్-కమల్ మధ్య చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఓ వైపు కమల్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -