ఈయన వయసెంతో తెలుసా..?

599
Jim Arrington-Oldest body builder
Jim Arrington-Oldest body builder
- Advertisement -

సంకల్పం మనిషిని ఎన్ని మెట్లు అయినా ఎక్కిస్తుంది.. చేరుకోలేని విజయ తీరాలకు చేరుస్తుంది.. ఈ మాటకు నేడు సజీవ సాక్ష్యంగా నిలిచాడు ఈ 85 ఏళ్ల బాడీబిల్డర్‌. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 30 సంవత్సరాలకే ముసలి వయసు వచ్చేస్తుంది కొందరికి. 40 ఏండ్లు వచ్చేసరికి కీళ్ల నొప్పులు,కంటి చూపు సరిగ కనిపించకపోవడం, 50 ఏండ్లకే కాటికి కాలు సాపుతున్న ఈ స్పీడ్ యుగంలో, జిమ్ ఆరింగ్ట‌న్‌ ప్ర‌పంచంలో అత్యంత వ‌య‌స్కుడైన ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్‌గా గిన్నిస్ వ‌రల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు.

కాలిఫోర్నియాలోని వెనిస్ ప్రాంతానికి చెందిన ఆరింగ్ట‌న్‌ 13 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌పుడు బాడీ బిల్డింగ్‌వైపు దృష్టి సారించాడు. త‌న వ‌య‌సు పిల్ల‌లంద‌రూ ఆట బొమ్మలు, కామిక్ పుస్త‌కాలు కొంటుంటే.. తాను మాత్రం బాడీ బిల్డింగ్ బొమ్మ‌లు ఉండే పుస్త‌కాల మీద ఆస‌క్తి చూపించేవాడిన‌ని ఆరింగ్ట‌న్ చెబుతున్నాడు. బాడీ బిల్డింగ్ మీద త‌న‌కు ఉన్న ఆస‌క్తి, శ్ర‌ద్ధ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని ఆరింగ్ట‌న్ అంటున్నాడు.

ఒక‌ప్ప‌టితో పోల్చుకుంటే ఇప్పుడు త‌న స‌త్తువ కొద్దిగా త‌గ్గిన‌ప్ప‌టికీ, బాడీ బిల్డింగ్ మీద త‌నకు ఉన్న ఆస‌క్తి మాత్రం త‌గ్గ‌లేద‌ని ఆరింగ్ట‌న్ వివ‌రించాడు.ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, క్రమపద్దతిలో ఆహారం తీసుకోవడంతో శరీరాన్ని పెంచుకున్నానని తెలిపాడు 85 ఏళ్ల బాడీబిల్డర్. ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలోనే ఓ జిమ్‌లో బాడీ బిల్డింగ్ గైడ్‌గా ప‌నిచేస్తున్న ఆరింగ్ట‌న్ అప్పుడప్పుడు జ‌రిగే బాడీబిల్డింగ్ పోటీల‌లో పాల్గొంటుంటాడు. 85 ఏళ్ల వయసులో కూడా ఇంత యాక్టివ్‌గా ఉండడం సాధ్యమేనా అనిపిస్తే ఈ వీడియో చూడండి..

- Advertisement -