టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన చిత్రం మగధీర. రాంచరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించింది. మగధీర దెబ్బ కలెక్షన్ల సునామీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా మగధీరతో పాటు బాహుబలి,భజరంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథనందించిన రచయిత విజేయేంద్రప్రసాద్ పలు ఆసక్తిర విషయాలను వెల్లడించారు.
విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీవల్లీ.’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడిన ఆయన చిరంజీవి, రామ్ చరణ్ కాంబనేషన్ లో ‘మగధీర-2’ కథ రాయాలని ఉందని ఈ సందర్భంగా తన మనసులో మాటను వ్యక్తం చేశారు. ఆ అవకాశం తనకు రావాలనీ, ఆ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నానని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
మనసు నుంచి వచ్చే భావ తరంగాలను చూడగలిగితే, వాటిని అదుపు చేయగలిగితే ఎన్నో మంచి పనులు చేయొచ్చని, ముఖ్యంగా చెడు జరగకుండా చూడొచ్చని, ఇందుకోసం అశోక్ మల్హోత్రా అనే సైంటిస్ట్ చేసే ప్రయోగం పేరే ‘శ్రీవల్లీ’ అని చెప్పారు. ఈ ప్రయోగాన్ని తనపై చేయమంటూ ఆ సైంటిస్ట్ కూతురు ముందుకొస్తుందని, ఆమె పేరు ‘శ్రీవల్లీ’ అని …ఈ ప్రయోగం వల్ల ఆమెకు గతజన్మ స్మృతులు మొదలవుతాయని, గత జన్మలో తన పేరు లైలా అని తెలుసుకుంటుందని అన్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ట్రయాంగిల్ ప్రేమకథతో నడుస్తుందని చెప్పారు.