స్టైలిష్ స్టార్ బన్నీ కోలీవుడ్ లో కూడా జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాడు. తన చిత్రాలన్నీ డబ్బింగ్ రూపంలో తమిళంలో
విడుదలవుతున్నా.. నేరుగా సినిమా చెయ్యాలని బన్నీ చాలా కాలంగా వేయిట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించేలా లింగుస్వామి బన్నీకి ఓ కథ చెప్పాడట.
దీంతో బన్నీ ఈ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ ఎంతకాలంగా ఆశపడుతున్న కోలీవుడ్ తెరంగేట్రం నిజం కాబోతుంది. కోలీవుడ్‌లో బన్నీని పరిచయం చేస్తూ.. తాజాగా స్టూడియోగ్రీన్ నిర్మాణ సంస్థ చెన్నైలో ఈ మూవీని ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లు అర్జున్‌ని కోలీవుడ్‌కి ఆహ్వానించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. అదే ఏడాది చివర్లో సినిమా విడుదల చేయ్యాలని నిర్మాత జ్ఞన వేల్ రాజా ప్రకటించాడు.