బతుకమ్మ చీరలు సిద్ధం…

236
Bathukamma sarees ready to distributed
- Advertisement -

17 నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేటలో  బతుకమ్మ చీరల పంపిణిపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్…ఈ నెల 16 నాటికి అన్నీ చీరలు జిల్లా కేంద్రాలకు చేరుతాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. వచ్చే 17,18,19 తేదీల్లో చీరల పంపీణీ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమం ద్వారా ఒక వైపు నేతన్నలకు ఉపాధితోపాటు, పండగ సందర్భంగా అడపడుచులకు సంతోషం పంచినట్టు అవుతుందన్నారు. ఈ చీరల పంపీణీలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేయాలన్నారు.

ప్రభుత్వం టెక్స్ టైల్ శాఖకు గతంలో ఎన్నడు లేనంత సహాకారం ఇస్తుందని తెలిపారు. ఈసారి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులతో పాటు పక్కా ప్రణాళికలతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీతోపాటు, నేతన్నకు చేయూత, యార్న్ సబ్సీడీ వంటి కార్యక్రమాలను చేపట్టామన్నారు.

 Bathukamma sarees ready to distributed

ఇకపై  ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ బట్ట నేతన్నల  నుంచే సేకరిస్తామన్నారు.  రెండు నెలల వ్యవధిలో కోటి అరు లక్షల అడపడుచులకు చీరలను అందిస్తున్నమన్నారు. రాష్ట్రంలోని నేతన్నల పూర్తి ఉత్పదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వార్షిక ప్రణాళికను తర్వలోనే ప్రభుత్వం ఉత్తర్వు రూపంలో ఇస్తామన్నారు.   ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న అర్డర్లతో నెలకు కనీసం 15 వేల రూపాయల వేతనం మూడు నెలలపాటు లభించిందన్నారు.

రంజాన్, క్రిష్టమస్, బతుకమ్మకు చీరలు, రాజీవ్ విద్యామిషన్ వస్ర్తాల సేకరణను వ్యవస్ధీకృతం చేయాలని అధికారులను అదేశించారు. వచ్చే ఏడాది నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ వస్ర్తాల సేకరణ జరపాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇందుకోసం అడ్వాన్స్ ప్లానింగ్ చేయాలన్నారు. ప్రభుత్వంలో వస్ర్తాలను సేకరిస్తున్న విద్యశాఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల శాఖాధిపతులతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

 Bathukamma sarees ready to distributed

టెక్స్ టైల్ శాఖ చేపట్టనున్న యార్న్ సబ్సీడీ, రసాయానాలు, అద్దకాలు సబ్సీడీ వంటి కార్యక్రమాలు వేంటనే ప్రారంభం కావాలని అధికారులను మంత్రి అదేశించారు. రాష్ట్రానికి వివిధ పథకాల కింద రావాల్సిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం డీల్లీలో ప్రత్యేక శ్రధ్ద వహించాలన్నారు. తాము ఇప్పటికే కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మతి ఇరానీని కలిసి ఈ మేరకు సహాకారం కోరామన్నారు. డిమాండ్  ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోనూ వెంటనే టెస్కో షోరూం ఏర్పాటు చేయాలని మంత్రి అదేశాలు జారీ చేశారు. ఇకపైన కేంద్రమంత్రులను కలిసే సందర్భంలో తెలంగాణ చేనత వస్ర్తాలు, గొల్కోండ కళాకృతులను అందిచాలని ఈమేరకు డిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేయాలన్నారు.

- Advertisement -