క్యూబాను తాకిన ఇర్మా…

228
Hurricane Irma: Cuba hit with maximum force
- Advertisement -

కరీబియ‌న్ దీవుల‌ను హ‌రికేన్ ఇర్మా వ‌ణికిస్తున్న‌ది. ఇర్మా వ‌ల్ల భారీ స్థాయిలో క‌రీబియ‌న్ దీవులు దెబ్బ‌తిన్నాయి. అనేక ప్రాంతాల్లో బిల్డింగ్‌లు కూలిపోయాయి. సుమారు ప‌ది మంది మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. బార్బ‌డా దీవి నివాసానికి ప‌నికి రాకుండా పోయింది. సెయింట్ మార్టినా కూడా దాదాపు కొట్టుకుపోయిన‌ట్లు అధికారులు చెప్పారు. హ‌రికేన్ ఇర్మా వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఇర్మాను అయిద‌వ క్యాట‌గిరీ తుఫాన్‌గా ప్ర‌క‌టించారు.

ఇర్మా హరికేన్ కమ్యూనిస్టు దేశం క్యూబాకు  చేరింది. ఇర్మా ప్రభావంతో క్యూబాలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీరప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమవుతున్నాయి. ఇక్కడ గంటకు 257 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అమెరికా వాతావరణ పరిశోధన శాఖ హెచ్చరించింది.

చాలా చోట్ల విద్యుత్తు, టెలిఫోన్‌ సౌకర్యాలు నిలిచిపోయాయి. మరోపక్క ఇవి కొండప్రాంతాలు కావడంతో మెరుపు వరదల ముప్పు పెరిగిపోయింది. దీంతో దిగువ ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోపక్క క్యూబా నుంచి దాదాపు 50,000 మంది పర్యాటకులు వెళ్లిపోయారు. దీంతో చాలా రిసార్టులు ఖాళీగా ఉన్నాయి. ఇర్మా హరికేను ఆదివారం నాటికి అమెరికాలోని ఫ్లొరెడా రాష్ట్రాన్ని తాకవచ్చని అంచనావేస్తున్నారు.

- Advertisement -