దూబాయ్‌లో ‘2.o’ ఆడియో..

184
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ దర్శకుడు. అమీజాక్సన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని గీతాల్ని అక్టోబరులో విడుదల చేస్తారు. పాటల వేడుకను దుబాయ్‌లో నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది.

 Robo 2.0 audio launch being planned in Dubai

ఈ నేపథ్యంలో చిత్ర విశేషాల గురించి లైకా సంస్థ ప్రతినిధి రాజు మహాలింగం ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘అక్టోబరులో ‘2.ఓ’ ఆడియో విడుదల కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహిస్తాం. నవంబరులో హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేస్తాం. డిసెంబరులో చెన్నైలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం’ అని చెప్పారు. ‘బాహుబలి 2’ తర్వాత ఆ స్థాయి అంచనాలతో ‘2.ఓ’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

మరో వైపు అక్టోబరు నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. సుధాంశు పాండే, అదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ తదితరులు నటించారు. సంగీతం: ఏఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: నిరవ్‌ షా, కూర్పు: ఆంటోని.

- Advertisement -