బాహుబలి తరువాత స్పైడర్ !

236
- Advertisement -

మహేష్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘స్పైడర్’. ఈ దసరాకి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో తన డబ్బింగ్‌ తానే చెప్పుకున్న మహేష్‌.. పూర్తి స్థాయిలో నటించిన తమిళ చిత్రం కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో మహేష్ తమిళంలో లాంచ్ అవుతుండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీమ్. ఈ నెల 9న చెన్నైలో భారీ ఎత్తున లాంచింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందులోనే తమిళ ఆడియోతో పాటు తెలుగు పాటల్ని కూడా విడుదల చేయనున్నారు.

Spyder

తెలుగు ఆడియన్స్ కోసం ఈ నెల 15న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరపాలని కూడా నిర్ణయించారు. ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. ఈనెల 27 తెలుగు .. తమిళ .. హిందీ .. మలయాళ .. అరబిక్ భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకూ జరిగిందని అంటున్నారు. ‘బాహుబలి’ .. ‘బాహుబలి 2’ తరువాత ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదేనని చెబుతున్నారు.

spyder reqests sensors

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడవగా, శాటిలైట్ .. ఆడియో హక్కులు కలుపుకుని 30 కోట్లకి అమ్ముడైనట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 69 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా రకుల్ ప్రీత్ మెడికోగా మెప్పించనుంది. హారిశ్‌ జైరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు.

- Advertisement -