వారసుడు ఎంట్రీ ఇవ్వకముందే నందమూరి బాలయ్య ఫుల్ ఖుషీ అవుతున్నాడు. నేడు మోక్షజ్ఞ బర్త్ డే నేపధ్యంలో నందమూరి ఫ్యాన్స్ ను ఖుషీ చేసే వార్త చెప్పాడు బాలయ్య. ప్రస్తుతం హిందూపురంలో ఉన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కుమారుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా అభిమానులతో జరుపుకున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా మోక్షజ్ఞ సినిమా ఎప్పుడన్న ప్రశ్న ఎదురవుతుందని, వచ్చే సంవత్సరం జూన్ కెల్లా ఓ మంచి బ్యానరులో తొలి చిత్రం ప్రారంభమవుతుందని బాలయ్య స్పష్టం చేశారు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ లాంచింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వారందరి కోరికా త్వరలోనే నెరవేరుతుందని ఈ సందర్భంగా బాలయ్య చెప్పారు.

మరోవైపు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మోక్షజ్ఞ ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది. దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అనే విషయాలపై బాలయ్య సన్నిహితులతోచర్చిస్తున్నారట. ఫైనల్ గా మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని భారీ ఫైటింగ్స్, ఛేజింగ్స్ తో తీయోద్దని, యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడట. మొత్తానికి తనయుడి విషయంలో బాలయ్య ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

