హృతిక్ రోషన్, కంగనాల మధ్య వివాదం ముగిసిపోయిందనుకుంటే, దాన్ని మళ్లీ వెలికితీసింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ నేపథ్యంలో అతడే నన్ను ఇష్టపడ్డాడు, అతడే నన్ను మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
తన భార్య సుసానే ఉండగానే హృతిక్ తనను ఇష్టపడ్డాడని, వారిద్దరి విడాకుల తరువాత కూడా అతడు తనను ఇష్టపడుతున్నానని చెప్పాడని కానీ, ఆ తరువాత తనను వదిలించుకున్నాడని, దీంతో చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది కంగనా.
ఇక తమ మధ్య ఉన్న బంధం గురించి బయటకు చెప్పినప్పుడు తనకు బెదిరింపులు మొదలయ్యాయని, దీంతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే, హృతిక్ కుటుంబం ఆ కమిషన్నూ కూడా కొనేసిందని తెలిపింది.
అంతేకాకుండా ఓ బాలీవుడ్ నటి కూడా ఈ విషయంలో తనకు హెచ్చరికలు చేసిందని, తనను ఇంటికి పిలిచిపించుకొని, “ఈ విషయాన్ని పెద్దది చేయకు. వారు చాలా ధనవంతులు, నిన్ను ఏమైనా చేయగలంటూ” వార్నింగ్ ఇచ్చిందని పేర్కొంది. దీంతో మరోసారి హృతిక్, కంగనాలు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారారు.