ఈ సినిమాకు అంత ఇచ్చుకోలేం..

237
Jr NTR starrer 'Jai Lava Kusa' finds no distributors in Visakhapatnam ...
- Advertisement -

ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండడంతో ఈచిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది. అయితే ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నాడు నిర్మాత కల్యాణ్‌రామ్‌.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ సహా అన్ని ప్రాంతాల హక్కులు భారీ ధరలకే అమ్ముడైనట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం వైజాగ్‌కి సంబంధించిన హక్కులే ఇక మిగిలివున్నాయి. ఎన్టీఆర్ చివరి రెండు చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వైజాగ్‌లో భారీ లాభాలు ఆర్జించాయనే విశ్లేషణల నేపథ్యంలో ఈ సినిమా హక్కులని రూ.8.5 కోట్లు కోట్ చేశాడట నిర్మాత కల్యాణ్‌రామ్.

Jai Lava Kusa audio launch called off

అయితే గతంలో భారీ అంచనాల మధ్య విడుదలైన పలు చిత్రాల వసూళ్లని దృష్టిలో పెట్టుకున్న అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అంత ధర వెచ్చించడానికి వెనకడుగు వేస్తున్నారట. రూ. 7 కోట్లకి అయితే పర్వాలేదు కానీ అంతకన్నా ఎక్కువ సాహసం చేయలేం అని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ తేల్చిచెప్పినట్టు సమాచారం.

దీంతో వైజాగ్ రైట్స్ మాత్రమే ఇంకా అమ్ముడుపోకుండా మిగిలివున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. కాగా..రిలీజ్ డేట్ కూడా సమీపిస్తోంది. మరి కల్యాణ్‌రామ్ కాస్త తగ్గతాడా లేక ఈ సినిమా క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లే నిర్మాత అడిగినంత మొత్తం ఇచ్చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

- Advertisement -