సెన్సార్ బోర్డుకు ‘స్పైడర్‌’ రిక్వెస్ట్‌..

183
spyder reqests sensors
- Advertisement -

ఈ రోజుల్లో ఒక సినిమా అంటే..అందులో మాస్‌, మసాలా, డ్రింకింగ్‌, స్మోకింగ్ కి సంబంధించిన సీన్స్ తప్పనిసరిగా ఉంటాయి. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఇది కామన్. కానీ స్పైడర్ సినిమాలో మాత్రం దీనికి సంబంధించిన సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదట.

విలన్ పాత్రలో నటిస్తున్న హీరో కూడా గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తాడే కానీ డ్రింక్ కానీ.. స్మోక్ చేస్తూ కానీ కనిపించరట. చివరికి బ్యాక్ గ్రౌండ్‌లో కూడా ఈ సీన్స్ కనిపించవట.

  spyder reqests sensors

దీంతో చిత్ర బృందం సెన్సార్ బోర్డు ముందు ఓ విన్నపాన్ని ఉంచింది. డ్రింకింగ్.. స్మోకింగ్‌కి సంబంధించిన విజువల్స్ ఏమీ లేవు కాబట్టి తమ సినిమాకు స్టాట్యుటరీ వార్నింగ్ వీడియో లేకుండా ప్లే చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది.

దీనికి సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రిన్స్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంత భారీ బడ్జెట్ మూవీలో డ్రింకింగ్.. స్మోకింగ్ సీన్స్ లేకపోవడం నిజంగా ఓ విశేషమే.

- Advertisement -