ఆ అవినీతి మంత్రి ఎవరు ?

194
'Don't politicise triple talaq issue', says PM Narendra Modi
- Advertisement -

అవినీతి రహిత పాలన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ దృఢ నిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. తన కేబినెట్లో ఎవరు అవినీతికి పాల్పడ్డ సహించేది లేదని మోడీ ఇప్పటికి స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి మండలి విస్తరణ నేపథ్యంలో, పనితీరు సరిగా లేకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరంతా బిజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా చేయగా.. ఓ కేంద్రమంత్రి మంత్రి మాత్రం మోడీ ఆదేశాల మేరకు చేసినట్లు తెలిసింది.

ఇటీవల ఓ అవినీతి కేసులో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులు అరెస్టయ్యారు. వీరిని విచారించగా సదరు కేంద్ర మంత్రి పేరు బయటకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై సిబిఐ పూర్తి విచారణ చేసిన తర్వాతనే ఆ కేంద్రమంత్రి పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. ఇందుకోసం ఆ మంత్రి కాల్‌ డేటా, ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ మంత్రికి సంబందమున్నట్లు సీబీఐ ధ్రువీకరించింది.

ఈ వ్యవహారమంతా మోడీ దృష్టికి రావడం.. మరోవైపు మంత్రి వర్గ పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్న క్రమంలో, తన అవినీతి బాగోతం బయటకు రాకముందే రాజీనామా చేయమని ప్రధాని మోడీ, సదరు కేంద్ర మంత్రిని ఆదేశించాడని సమాచారం. కాగా అవినీతికి పాల్పడ్డ ఆ మంత్రి పేరు బయటకు రాలేదు. అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ కేసు విషయాలను బయటకు రాకుండా చూడాలని సీబీఐని మోడీ ఆదేశించినట్టు సమాచారం.

- Advertisement -