టీడీపీలో చేరి తప్పు చేశా:జేసీ

210
jc sensational comments on joining tdp
- Advertisement -

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ని వీడి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశానని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మార్కెడ్‌యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తనకు కుల పిచ్చి(రెడ్డి) ఉందని, అయితే సీఎం చంద్రబాబుతోపాటు చాలా మంది టీడీపీ నేతలకు ఈ విషయం తెలియదని చెప్పారు. సీఎం తనకు కిరీటం ఏమీ పెట్టలేదని.. అయినా తనకు అలాంటివి అవసరంలేదని వ్యాఖ్యానించారు.

ఇక పోలవరం ప్రాజెక్టును 2019కళ్లా పూర్తి చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడని, అది జరిగే పని కాదన్నారు. రుణమాఫీ కాలేదని చాలా మంది రైతులు చెబుతున్నారని, అలాంటి వారెవరైనా తన దగ్గరకు వస్తే వారం రోజుల్లోగా మాఫీ చేయిస్తానని చెప్పుకొచ్చారు.

పనిలో పనిగా జగన్‌కు సైతం చురకలంటించారు జేసీ. మా వాడికి రాజకీయ అనుభవం లేదంటూ ఎద్దేవా చేశారు.

- Advertisement -